ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ స్టేషన్‌లో వానరం హల్‌చల్‌

ఉత్తరప్రదేశ్‌లో పోలీసు తల్లో పేలు చూసిన కోతి ఫిలిబిత్ పోలీస్‌ స్టేషన్‌లో వానరం హల్‌చల్‌ పోలీస్ ఆఫీసర్‌ భుజాలపై ఎక్కిన వానరం అటవీ సిబ్బంది సహాయంతో కోతిని అడవిలో వదిలిన పోలీసులు

Update: 2019-10-09 06:10 GMT

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లో కోతి హల్‌చల్‌ చేసింది. చిన్నప్పుడు తల్లి పిల్లాడికి పేలు చూసినట్లు ఆ కోతి పేలు చూడడం అందరిని ఆశ్చర్యపరిచింది. ముందు సదర్‌ థానా స్టేషన్‌లోకి ప్రవేశించిన కోతి, ఏకంగా పోలీస్‌ అధికారి భుజాలపైకి ఎక్కింది. అయితే ఆ పోలీస్ బాస్ ఏమాత్రం బెదరలేదు. భూజలపైకి ఎక్కిన కోతి ఏకంగా పోలీస్‌ తల నిమురుతూ పేలు కూడా చూసింది. అటవీ సిబ్బంది సహాయంతో వానరాన్ని అడవికి తరలించారు పోలీసులు. అయితే గతంలో కూడా ఆ కోతి ఇలానే పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు అధికారులు అంటున్నారు.   

Full View

Tags:    

Similar News