World Famous Lover ట్విట్టర్ రివ్యూ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్‌ను అంతా ఇంతా కాదు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సినిమాల్లో చేసిన క్యారెక్టర్ చిన్నదే అయినా.

Update: 2020-02-14 01:46 GMT
world famous lover

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్‌ను అంతా ఇంతా కాదు. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, సినిమాల్లో చేసిన క్యారెక్టర్ చిన్నదే అయినా.., ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యారు. 'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైయ్యారు. అర్జున్‌రెడ్డి', 'గీతగోవిందం' యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కాగ... తాజా విజయ్ దేవరకొండ హీరోగా రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు కాంత్రి మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా భారీ అంచనాలతో ఫిబ్రవ‌రి 14న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్విటర్ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం?

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం టికెట్ ధరలు పెంచినప్పటీకి బుకింగ్స్ జోరు తగ్గలేదు. తొలిరోజే అన్ని థియోటర్లు నిండిపోతున్నాయి. నగరంలో అయితే మొత్తం థియేటర్లు హౌస్‌ఫుల్ అయిపోయాయి. దీన్ని బట్టి విజయ్ దేవరకొండ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

యూఎస్‌లో ఈ సినిమాపై ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ప్రధమార్థంపై మిక్స్‌డ్ రిపోర్ట్ వచ్చింది. తొలిభాగం సూపర్ అంటూ కొంతమంది అంటుంటే.. పర్వాలేదు అని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ మరోసారి నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారట. ఈ సినిమాలో నలుగురు ముద్దుగుమ్మలు రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ అద్భుతంగా నటించారని ప్రశంసిస్తున్నారు. డైరెక్టర్ క్రాంతి మాధవ్ టేకింగ్ సూపర్బ్ అని అంటోన్నారు. ఇక సెకండాఫ్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి అని అంటున్నారు.

కథలో కథ అనే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. దాన్ని థియేటర్‌ల ప్రేక్షకుడు ఎంత వరకు అర్థం చేసుకుంటాడు అనేది కష్టమే అంటున్నారు. మొత్తం మీద సినిమా అయితే బాగుంది పెద్దగా ఎంజాయ్ చేసేది లేదని ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ నిరాశ పరిచిన విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ వచ్చాడు హిట్ కొట్టేశాడంటూ.. ఓనెటిజన్ కామెంట్ చేశాడు.

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు రేంజ్ గా ఉందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ద్వితీయార్థంలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఉంటుందని టాక్.

 




Tags:    

Similar News