ఇండస్ట్రీ అంతా పాన్ ఇండియా హీరోలే ఉంటారా
* ప్యాన్ ఇండియానే తమ టార్గెట్ గా మార్చుకుంటున్న టాలీవుడ్ హీరోలు
ఇండస్ట్రీ అంతా పాన్ ఇండియా హీరోలే ఉంటారా
Pan India Heros: బాహుబలి తర్వాత దాదాపు టాలీవుడ్ లో ఉన్న హీరోలు అందరూ ప్యాన్ ఇండియా సినిమాలో మీద పడ్డారు. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరూ తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు.
ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, "పుష్ప" సినిమాతో అల్లు అర్జున్, "కార్తికేయ 2" సినిమాతో నిఖిల్ వంటి హీరోలు కూడా ఈ జాబితాలో చేరిపోయారు. త్వరలోనే ఈ జాబితాలో చేరబోతున్నారు నాని మరియు అక్కినేని అఖిల్. రామ్ చరణ్ కూడా బుచ్చిబాబు సన డైరెక్షన్లో చేస్తున్న సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. మరోవైపు కొరటాల డైరెక్షన్లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో నే విడుదల కాబోతోంది. "దసరా" సినిమాతో నాచురల్ స్టార్ నాని ఈ జాబితాలో చేరబోతుండగా, యువ హీరో అక్కినేని అఖిల్ కూడా తన "ఏజెంట్" సినిమాతో పాన్ ఇండియా హీరో కాబోతున్నారు.
నిఖిల్, శర్వానంద్, నితిన్, సిద్దూ జొన్నలగడ్డ రామ్ పోతినేని వంటి హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలపై కన్నేశారు. అయితే మరోవైపు కిరణ్ అబ్బవరం, సుహాస్ వంటి చిన్న హీరోలు మాత్రం చిన్న సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. అయితే టైర్ 2 లోకి ప్రవేశించిన ఏ హీరో అయినా ఆఖరికి ప్యాన్ ఇండియా సినిమాని టార్గెట్ గా ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇలా అయితే ఇక ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా హీరోలే ఉంటారేమో అని అనుమానాలు కూడా వస్తున్నాయి.