Bigg Boss 9: బిగ్ బాస్ 9 లిస్ట్‌లో ఈ ఫోక్ సింగర్ పేరు? ఇంతకీ ఆమె ఎవరు?

Bigg Boss 9: బిగ్ బాస్‌ 9కు సర్వం సిద్ధమైంది. కంటెస్టంట్ల సెలక్షన్స్‌ కూడా త్వరలో ఫైనల్ కానున్నాయి. అయితే ఇందులో మన తెలంగాణ ఫోక్ సింగర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2025-07-14 10:14 GMT

Bigg Boss 9: బిగ్ బాస్ 9 లిస్ట్‌లో ఈ ఫోక్ సింగర్ పేరు? ఇంతకీ ఆమె ఎవరు?

Bigg Boss 9: బిగ్ బాస్‌ 9కు సర్వం సిద్ధమైంది. కంటెస్టంట్ల సెలక్షన్స్‌ కూడా త్వరలో ఫైనల్ కానున్నాయి. అయితే ఇందులో మన తెలంగాణ ఫోక్ సింగర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో తన పాటలు తెగ వైరల్ కావడంతో బిగ్ బాస్‌ నుంచి ఆమెకు ఆఫర్ వచ్చినట్లు సదమాచారం. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 9 కు రంగం సిద్దమైంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఈ రియాలిటీ షో.. త్వరలో అన్ని పనులు పూర్తిచేసుకుని ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లకు పిలుపు వెళ్లడం, అందులో కొందరిని ఫైనల్ చేయడం కూడా జరిగింది. ఈ లిస్ట్‌లో మన తెలంగాణ ఫోక్ సింగర్ కూడా ఉన్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ క్రేజ్ ఎక్కువగా పెరిగిపోయింది. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిపోయాయి. యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్‌ని సంపాదించుకుంటున్నాయి. అయితే ఇలా పాపులర్ అయిన కొంతమందిని బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సీజన్ 9కి కూడా కొంతమంది ఫోక్ సింగర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సింగర్ లక్ష్మి ఉన్నట్లు సమాచారం.

లక్ష్మీ ఎవరో కాదు నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని గన్నోర గ్రామానికి చెందిన అమ్మాయి. ఫోక్ సాంగ్స్ పాడటంలో దిట్ట. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తిన్నా తీరం పడుతలే.. కూసున్నా తీరం పడుతలే, ఆనాడేమన్నంటినా తిరుపతి.. నిన్ను ఈనాడేమన్నంటినా తిరుపతి.. పాటలు తెగ వైరల్ అయ్యాయి. దీనికోసం లక్ష్మీని కూడా బిగ్‌ బాస్‌లోకి తీసుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

లక్ష్మి చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంది. ఫోక్ సాంగ్స్ ఆమె స్పెషల్. ఏకంగా పాన్ ఇండియా సినిమా పుష్ప 2లోనూ ఫీలింగ్స్ అనే పాట పాడే అవకాశం ఆమెకు దక్కింది. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అయితే సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న ఈ సింగర్ త్వరలో బిగ్ బాస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఇదే విషయాన్ని ఆమెను అడిగితే బిగ్ బాస్ అవకాశం వస్తే కచ్చితంగా వెళతాను అంటూ కొంతమందికి సమాధానం చెప్పింది. మరి ఈ సారి బిగ్ బాస్‌9లోకి లక్ష్మీ వెళుతుందేమో చూడాలి.


Tags:    

Similar News