కరణ్ జోహార్ ఆఫీస్ లో ప్రత్యక్షమైన పూరి జగన్నాథ్

*కరణ్ జోహార్ ఆఫీస్ లో ప్రత్యక్షమైన పూరి జగన్నాథ్

Update: 2023-03-10 12:30 GMT

పూరి జగన్నాథ్ మరియు చార్మికౌర్ ఎందుకు కరణ్ జోహార్ ఆఫీస్ కి వెళ్ళారు?

Puri Jagannadh: ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ అందులో కొందరు వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. అందులో "ఆచార్య" సినిమాతో డిజాస్టర్ అందుకున్న కొరటాల శివ తో పాటు "లైగర్" సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ అందుకున్న పూరీ జగన్నాథ్ కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన "లైగర్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే చతికిలబడింది. ఇక ఆ సినిమాతో భారీ నష్టాలు అందుకున్న పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథని సిద్ధం చేశారు.

రామ్ చరణ్ కోసం కూడా ఒక స్క్రిప్ట్ అనుకున్నారు కానీ ఆ రెండు వర్కౌట్ అవలేదు. అయితే తాజాగా ఇప్పుడు పూరి జగన్నాధ్ మరియు చార్మి ముంబై ఎయిర్ పోర్ట్ లో కరణ్ జోహార్ ఆఫీస్ కి వెళుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ఆయన కరణ్ జోహార్ ఆఫీస్ లో పూరి జగన్నాథ్ మరియు చార్మి ఎందుకు ప్రత్యక్షమయ్యారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి "లైగర్" సినిమాని హిందీలో రిలీజ్ చేసింది కరణ్ జోహారే. అయితే ఈ సినిమా ఫైనాన్స్ కి సంబంధించిన సెటిల్మెంట్ గురించి మాట్లాడడానికి పూరి జగన్నాథ్ మరియు చార్మి కరణ్ జోహార్ ఆఫీస్ కి వెళ్ళారని కొంతమంది చెబుతున్నారు. అయితే మరి కొందరు మాత్రం ఈ ముగ్గురు కలిసి మరొక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. గతంలో "ఇస్మార్ట్ శంకర్" సినిమాని టైగర్ ష్రాఫ్ తో "స్క్రూడీలా" అనే టైటిల్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ఇక మరోవైపు పూరి జగన్నాథ్ ఒక బాలీవుడ్ హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News