మోహన్ బాబు కుటుంబంలో చిచ్చుపెట్టిన వినయ్ మహేశ్వర్ ఎవరు.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?
Manchu Family Fight: మంచు కుటుంబం రచ్చకెక్కింది. తన కుమారుడు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని తండ్రి మోహన్ బాబు కంప్లైయింట్ ఇవ్వగా..
మోహన్ బాబు కుటుంబంలో చిచ్చుపెట్టిన వినయ్ మహేశ్వర్ ఎవరు.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?
Manchu Family Fight: మంచు కుటుంబం రచ్చకెక్కింది. తన కుమారుడు మనోజ్, కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని తండ్రి మోహన్ బాబు కంప్లైయింట్ ఇవ్వగా.. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి ఇచ్చిన కంప్లైంట్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మనోజ్ ఒక లేఖ రాశాడు. అందులో వినయ్ మహేశ్వర్ పేరు ఉంది. ఇంతకీ వినయ్ మహేశ్వర్ ఎవరు..? ఆయనకు, మంచు కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం..?
మోహన్ బాబు కుటుంబ వివాదంలో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వర్ ఇతని కారణంగానే గొడవ పెద్దదైందని మనోజ్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. అసలు మనోజ్ తండ్రి మోహన్ బాబుతో మాట్లాడుతుండగా వినయ్, మనోజ్ మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు ఎవరికీ తెలియని సస్పెన్స్ గా మారింది. వినయ్ అసలు పేరు వినయ్ మహేశ్వరి. ఆయన గతంలో 2019 నుంచి 2022 వరకు ఓ మీడియా సంస్థల సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ(నిర్మాణ సంస్థ) మేనేజింగ్ పార్ట్‌నర్‌గా, SUCSTRAT CONSULTING PRIVATE LIMITEDకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.
నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే తిరుపతి మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఉంటూ మిగిలిన సమయం అంతా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, దుబాయ్ వంటి నగరాల్లో తిరుగుతూ ఉంటాడని అతని సన్నిహితులు చెబుతున్నారు. గతంలో మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజుల అక్రమాలపై విద్యార్థి సంఘాల నేతలు ఇతన్ని కలవడానికి ప్రయత్నిస్తే నిరాకరించారు. ఇక అప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనకు స్వయంగా మంచు మనోజ్ మద్దతు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ఇక అప్పటి నుంచి వివాదం మొదలైనట్టు తెలుస్తోంది, అలాగే ఒకవైపు తండ్రి మోహన్ బాబు, వినయ్ మహేశ్వర్ కు విద్యా సంస్థల్లో పెద్ద పీట వేయడం మొదటి నుంచి మనోజ్ దాన్ని వ్యతిరేకిస్తూ రావడంతో వినయ్, మనోజ్ మధ్య వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది
మోహన్ బాబు సమక్షంలో జరిగిన గొడవలో వినయ్ మహేశ్వర్ తనపై చేయి చేసుకున్నారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడికి సంబంధించిన పుటేజీ ఉన్న సీసీ కెమెరా, డీవీఆర్ ను వినయ్ తీసుకుపోయినట్టుగా తెలియడంతో మనోజ్ మరింత ఆగ్రహానికి లోనయ్యారు. ఇక ముంబై నుంచి వచ్చిన తన సోదరి లక్ష్మీ మాట కూడా వినకపోవడంతో ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. మొత్తానికి వినయ్ కారణంగా మంచు ఫ్యామిలీలో గొడవలకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఇక మరి ఈ గొడవల కారణంగా రాబోయే రోజుల్లో వారి కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.