Bappi Lahiri : ఆ స్టార్ సింగర్ చనిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న బంగారం అంతా ఏమైంది ?
దివంగత సింగర్ బప్పీ లహిరి గురించి తెలియని వారు ఉండరు. పాటల మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందో, బంగారం మీద కూడా అంతే ప్రేమ ఉండేది. అందుకే ఆయన్ని గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. 2022లో ఆయన మరణించిన తర్వాత ఆయన దగ్గర ఉన్న భారీ బంగారు ఆభరణాలు ఏమయ్యాయో చాలామందికి తెలియదు. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Bappi Lahiri : ఆ స్టార్ సింగర్ చనిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న బంగారం అంతా ఏమైంది ?
Bappi Lahiri : దివంగత సింగర్ బప్పీ లహిరి గురించి తెలియని వారు ఉండరు. పాటల మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందో, బంగారం మీద కూడా అంతే ప్రేమ ఉండేది. అందుకే ఆయన్ని గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. 2022లో ఆయన మరణించిన తర్వాత ఆయన దగ్గర ఉన్న భారీ బంగారు ఆభరణాలు ఏమయ్యాయో చాలామందికి తెలియదు. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బప్పీ లహిరి గాయకుడిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆయనను చూస్తే బంగారు షోరూంలా అనిపించేది. బప్పీ లహిరి 2022 ఫిబ్రవరి 15న మరణించారు. ఆయన మరణం చాలామంది అభిమానులకు బాధ కలిగించింది. ఆయన మరణానంతరం, ఆయన కుమారుడు బప్పా లహిరి ఆ బంగారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బప్పీ తన వీలునామాలో తన బంగారం అంతా తన కుమారుడు బప్పా, కుమార్తె రీమాకు చెందాలని రాశారట.
"మా నాన్న ధరించే బంగారం కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు, అది ఆయనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆయన ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి బంగారాన్ని సేకరించేవారు. ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే, దానిని బంగారంగా మార్చి ఆభరణంగా ధరించేవారు" అని ఆయన కుమారుడు తెలిపారు.
బప్పీ లహిరి బంగారం లేకుండా ఎక్కడికీ వెళ్ళేవారు కాదు. ఉదయం 5 గంటలకు విమానం ఉన్నా, అన్ని బంగారు ఆభరణాలు ధరించే బయలుదేరేవారు. ఆ బంగారం ఆయనకు గుడితో సమానం, ఒక రకంగా ఆయనకు ఆధ్యాత్మికంగా వాటితో అనుబంధం ఉండేది. "మేము ఆ బంగారాన్ని భద్రంగా కాపాడుకుంటాము. దానిని ఒక మ్యూజియంలో ఉంచే ఆలోచన కూడా ఉంది. దాని వల్ల ప్రజలు దానిని చూడవచ్చు" అని ఆయన కుమారుడు వెల్లడించారు.
బప్పీ లహిరి జీవితం
బప్పీ లహిరి కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. బాలీవుడ్‌లో డిస్కో బాయ్ అని బప్పీ లహిరిని పిలిచేవారు. తన చిరునవ్వుతో అందరినీ ఆకర్షించారు. 2022లో ఆయన ఆకస్మిక మరణంతో, సంగీత ప్రపంచం ఒక గొప్ప గాయకుడిని కోల్పోయింది.