Singer Kalpana: ప్రముఖ సింగర్ కల్పనా రాఘవేంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని నిజాంపేటలో నివాసం ఉంటున్న ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇంటి తలపులు తీయకపోవడంతో.. తన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ప్రసాద్ అపార్ట్ మెంట్ వాసులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడటమే కాకుండా తాజాగా స్పృహలోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి సంబంధించి కల్పన కూతురే కారణమని తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం నిన్న కేరళ నుంచి కల్పన హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కేరళతోపాటు చెన్నైలో ఉండే కల్పన హైదరాబాద్ కు చాలా రోజుల తర్వాత వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం ఉదయం హైదరాబాద్ కు వచ్చిన ఆమె పెద్ద కూతురుతో మాట్లాడిన తర్వాత ఆమెను కేరళ నుంచి హైదరాబాద్ కు రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే దీనికి కూతురు ఒప్పుకోకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మోతాదుకు మించిన నిద్రమాత్రలు వేసుకోవడంతో కల్పన అపస్మారకస్థితిలోకి వెళ్లింది. తాను నిద్రమాత్రలు వేసుకున్న తర్వాత తన భర్త ప్రసాద్ కు కాల్ చేసి నిత్రమాత్రలు వేసుకున్నట్లు చెప్పగా ప్రసాద్ పోలీసులుతో పాటు కల్పన ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులకు చెప్పినట్లు తెలుస్తోంది.