War 2: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు.. వేదిక ఇదే
‘వార్ 2’ (War 2) ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెలకొన్న అనుమానాలకు చెక్ పడింది. నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ అధికారికంగా తేదీ, వేదికను ప్రకటించింది. ఈ నెల 10న సాయంత్రం 5 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో వేడుక జరగనుంది.
War 2: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు.. వేదిక ఇదే
హైదరాబాద్: ‘వార్ 2’ (War 2) ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నెలకొన్న అనుమానాలకు చెక్ పడింది. నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ అధికారికంగా తేదీ, వేదికను ప్రకటించింది. ఈ నెల 10న సాయంత్రం 5 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో (War 2 Pre release event venue) వేడుక జరగనుంది.
హిట్ మూవీ ‘వార్’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలసి నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్’లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అడ్వాణీ హీరోయిన్. ఈ నెల 14న (War 2 release date) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవలి రోజుల్లో విజయవాడలో ఈ ఈవెంట్ జరగనుందని వచ్చిన రూమర్స్‌ను టీమ్ ఖండించింది.