War 2: అలియా తిరస్కరించిన రోల్‌కి కియారా ఫైనల్.. కానీ పాత్ర బలహీనమే!
సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే అభిప్రాయం ఉంది. ఎక్కువగా గ్లామర్‌కే పరిమితం చేస్తారనేది టాక్.
War 2: అలియా తిరస్కరించిన రోల్‌కి కియారా ఫైనల్.. కానీ పాత్ర బలహీనమే!
సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే అభిప్రాయం ఉంది. ఎక్కువగా గ్లామర్‌కే పరిమితం చేస్తారనేది టాక్. అయితే ఇటీవల కొంతమంది దర్శకులు హీరోలతో సమానంగా హీరోయిన్‌లకు కూడా బలమైన పాత్రలు ఇస్తున్నారు. కానీ ప్రతీ సినిమా అలాంటిదే అనడం కష్టమే. తాజాగా విడుదలైన ‘వార్ 2’ కూడా ఈ చర్చలో హాట్‌టాపిక్ అవుతోంది.
ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించినప్పటికీ, ఆమె పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదని ప్రేక్షకుల అభిప్రాయం. ముఖ్యమైన సీన్లు ఎడిటింగ్‌లో ట్రిమ్ చేయడంతో, రోల్ మరింత బలహీనంగా అనిపించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పాత్రకు మొదట అలియా భట్‌నే కాస్ట్ చేయాలని అనుకున్నారట దర్శకుడు అయాన్ ముఖర్జీ. ‘బ్రహ్మాస్త్ర’లో అయాన్–అలియా కాంబినేషన్ బాగా వర్కౌట్ అయినప్పటికీ, ఈ రోల్‌కి తాను న్యాయం చేయలేనేమో అన్న భావనతో అలియా సున్నితంగా తిరస్కరించిందట. ఆ తర్వాత కృతి సనన్, శ్రద్ధా కపూర్ పేర్లూ పరిశీలనలోకి వచ్చాయి.
చివరికి వరుస విజయాలతో ట్రెండ్‌లో ఉన్న కియారా అద్వానీని ఫైనల్ చేశారు. కానీ సినిమాలో హీరోలు, విలన్లు ఎక్కువ హైలైట్ కావడంతో, కియారా పాత్ర పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదనే టాక్ బీటౌన్‌లో వినిపిస్తోంది.