Cult: పాన్ వరల్డ్ మూవీని మొదలు పెట్టిన విశ్వక్ సేన్.. ప్రపంచ భాషల్లో విడుదల
Vishwak Sen Upcoming Movie: మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి తన క్రియేటివ్ టాలెంట్‌ను నిరూపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నటుడిగా మాత్రమే కాకుండా, ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి సినిమాల్లో దర్శకుడు, నిర్మాత, కథా రచయితగా తన ప్రతిభను చాటిన విశ్వక్సేన్, ఇప్పుడు #CULT అనే ఓ భారీ ప్రాజెక్ట్‌కి రంగంలోకి దిగారు.

తరక్ సినిమా అండ్ వన్మయ్ క్రియేషన్స్ బ్యానర్లపై కరాటే రాజు, సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ సినిమాకు విశ్వక్సేన్ కథ రాయడం, దర్శకత్వం వహించడం విశేషం. ఇది ఓ న్యూఏజ్ పార్టీ థ్రిల్లర్‌గా రానుంది. సరికొత్త కంటెంట్‌తో, రియల్ లైఫ్ ఘటనల ఆధారంగా రూపొందుతోంది.
పార్టీ వాతావరణంలో, ఓ వ్యక్తి మేకపిల్ల మాస్క్ ధరించి ఉండే పోస్టర్‌తో విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, ఈ సినిమా వైవిధ్యాన్ని ముందుగానే చూపిస్తోంది. ఇది సంప్రదాయ థ్రిల్లర్లకు భిన్నంగా, కొత్త అనుభూతి ఇచ్చేలా ఉండబోతోందని టీజర్‌నే చెబుతోంది.
రామానాయుడు స్టూడియోస్‌లో ఆదివారం #CULT గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ వేడుకలో ప్రత్యేక అతిథులుగా ఎస్ రాధాకృష్ణ (చిన్నబాబు), తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అరవింద్ హాజరయ్యారు. చిన్నబాబు టైటిల్‌ను ఆవిష్కరించగా, తలసాని క్లాప్ ఇచ్చారు, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇదే రోజు రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
ఈ సినిమాలో విశ్వక్సేన్‌తో పాటు 40 మంది కొత్త నటీనటులకు వెండి తెరకు పరిచయం కానున్నారు. సినిమాకి భారీ టెక్నికల్ టీమ్ సపోర్ట్‌గా ఉంది. ఈ సినిమా తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. ఇది గ్లోబల్ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ప్రాజెక్ట్ అనే విషయం ఇదివరకే స్పష్టమవుతోంది.
టెక్నికల్ క్రూ వివరాలు:
కథ, దర్శకత్వం, నిర్మాత: విశ్వక్సేన్
నిర్మాతలు: కరాటే రాజు, సందీప్ కాకరాల
బ్యానర్లు: తరక్ సినిమాస్, వన్మయ్ క్రియేషన్స్
మ్యూజిక్: రవి బసుర్ (KGF, సలార్ ఫేమ్)
సినిమాటోగ్రఫీ: అర్వింద్ విశ్వనాథన్
ఎడిటింగ్: రవి తేజ గిరిజాల
ఆర్ట్ డైరెక్టర్: అర్వింద్ మ్యూలే
వీఎఫ్‌ఎక్స్ సూపర్వైజర్: ప్రశాంత్ నాయర్
కొరియోగ్రఫీ: వశ్వంత్ మాస్టర్
యాక్షన్ డైరెక్టర్: కరుణక్ ఏఆర్
కాస్ట్యూమ్స్: అన్నపూర్ణ
పీఆర్‌ఓ: వంశీ-శేఖర్