మళ్ళీ ఆ సినిమాను పట్టాలెక్కించనున్న మంచు విష్ణు

Update: 2019-04-21 12:28 GMT

వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరోల లో మంచు విష్ణు కూడా ఒకడు. గత కొంత కాలంగా ఒక్క హిట్ కూడా అందుకోని మంచు విష్ణు తాజాగా తమిళ తెలుగు భాషల్లో 'ఓటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. తన ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమాను పక్కన పెడితే మూడేళ్ల క్రితం విష్ణు ఒక సినిమా ఓకే చేశాడు. అందులో విష్ణు మహా శివుని భక్తుడైన కన్నప్ప పాత్రలో కనిపించాల్సి ఉంది.

తనికెళ్ల భరణి స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్తో తెరకెక్కాల్సింది. తనికెళ్ల భరణి ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అటకెక్కింది. అయితే తాజాగా మంచు విష్ణు ఈ సినిమాని మళ్ళీ పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో కొన్ని అద్భుతమైన లొకేషన్లల ను వెతికే పనిలో పడ్డట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి ఈ సినిమాతో అయినా విష్ణు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Similar News