Manchu Vishnu: ప్రభాస్‌కు ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు కానీ.. విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
Manchu Vishnu: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
Manchu Vishnu: ప్రభాస్‌కు ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు కానీ.. విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
Manchu Vishnu: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాలో విష్ణు టైటిల్ పాత్రలో నటించగా, ప్రభాస్ ప్రత్యేక పాత్రలో రుద్రుడిగా కనిపించనున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో ఉన్నారు.
ఈవెంట్‌లో మంచి విష్ణు మాట్లాడుతూ.. "నిజానికి ప్రభాస్‌కు ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. కానీ మా నాన్నగారు మోహన్‌బాబుపై ఉన్న గౌరవంతో ఆయన ఈ సినిమా కోసం రాగా, అది మా కుటుంబానికి ఎంతో గొప్ప విషయం,’’ అని అన్నారు.
‘‘నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడిలాంటి వాడు. కృష్ణుడు స్నేహితుడిగా మార్గాన్ని చూపిస్తాడు. కర్ణుడు తోడుగా నిలుస్తాడు. ప్రభాస్ నా కోసం మార్గదర్శకుడిగా, మద్దతుగా నిలిచాడు. నాకు ఇలాంటి వ్యక్తి సహచరుడిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను,’’ అని పేర్కొన్నారు.
విష్ణు ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను పూర్తిచేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆ సమయంలో ‘శివా శివా’ పాట నాకు ఆశా కిరణంగా మారింది. ఆ పాట సాహిత్యాన్ని ఎవరైనా మనసుపెట్టి వినాలి, అప్పుడు అది ఎంత గొప్పదో అర్థమవుతుంది’’ అన్నారు.
‘‘ప్రపంచ స్థాయిలో స్టార్ అయినప్పటికీ ప్రభాస్ మనసులో మాత్రం మారలేదని నేను గర్వంగా చెప్పగలను. అతడి సహజత్వం, వినయవంతమైన వైఖరి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది. డబ్బు, పాపులారిటీ వస్తే కొందరు మారిపోతారు. కానీ ప్రభాస్ ఎప్పటికీ మారడు. నేను కర్ణుడిలా నీ వెనుక ఉంటాను ప్రభాస్.. నీవు ఏం కావాలన్నా అడుగు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.