Rakul Preet: మ‌నం ఇంత ఖాళీగా ఉంటున్నామా.? కోహ్లి, అవ్‌నీత్‌కౌర్ వ్య‌వ‌హారంపై ర‌కుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rakul Preet: ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రకుల్‌ మాట్లాడుతూ – ‘‘ఇంత చిన్న విషయం గురించి ఇంత పెద్ద చర్చ జరగడం నిజంగా విచారకరం.

Update: 2025-05-30 06:17 GMT

Rakul Preet: నటి అవ్‌నీత్‌ కౌర్‌ ఫ్యాన్‌ పేజీలో ఓ పోస్ట్‌ను టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ లైక్‌ చేయడం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ ఇప్పటికే స్పందించి క్లారిటీ ఇచ్చినా, ఈ విషయం మీద చర్చలు ఇంకా ఆగలేదు. అయితే తాజాగా ఈ అంశంపై నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్పందించారు.

ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రకుల్‌ మాట్లాడుతూ – ‘‘ఇంత చిన్న విషయం గురించి ఇంత పెద్ద చర్చ జరగడం నిజంగా విచారకరం. మనకు ఎంత ఖాళీగా సమయం ఉందంటే, ఎవరో ఒకరు ఎవరి పోస్ట్‌ లైక్‌ చేశారో కూడా విశ్లేషించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక లైక్‌ వల్ల ఆమెకు రెండు మిలియన్ల ఫాలోవర్స్‌ పెరిగారు అనడమే విడ్డూరం. అది ఉద్దేశపూర్వకమా లేక పొరపాటా అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇలా సోషల్‌ మీడియాలో సమయం వృథా చేయడం తప్పే.’’ అని అన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫీడ్‌ను క్లియర్‌ చేస్తున్న సమయంలో పొరపాటున లైక్‌ బటన్‌ ప్రెస్‌ అయ్యిందని కోహ్లీ గతంలో స్పష్టంగా చెప్పారు. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగినదని, దయచేసి ఎలాంటి ఊహాగానాలు గానీ కథనాలు గానీ సృష్టించవద్దని కోరారు. అయితే ఈ లైక్‌ అనంతరం అవ్‌నీత్‌ కౌర్‌ ఫాలోవర్స్‌ సంఖ్య ఒక్కసారిగా పెరగడం, ఆమెకు కొత్త ప్రమోషన్‌ అవకాశాలు రావడం బాలీవుడ్‌ మీడియాలో వార్తలుగా మారాయి.

Tags:    

Similar News