Viral Vayyari Song: విద్యార్ధి వేసిన వైరల్ వయ్యారి డ్యాన్స్‌కు హీరో ఫిదా.. వైరల్ వీడియో
Viral Vayyari Song: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పాట వైరల్ వయ్యారి. ఈ పాటపై ఎంతోమంది డ్యాన్సులు వేసి పోస్ట్‌లు పెడుతున్నారు.
Viral Vayyari Song: విద్యార్ధి వేసిన వైరల్ వయ్యారి డ్యాన్స్‌కు హీరో ఫిదా.. వైరల్ వీడియో
Viral Vayyari Song: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పాట వైరల్ వయ్యారి. ఈ పాటపై ఎంతోమంది డ్యాన్సులు వేసి పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే.. తాజాగా ఒక చిన్నారి ఏకంగా జూరియర్ సినిమా హోరో ముందే ఈ పాటపై డ్యాన్స్ వేసి హీరోని మెప్పించింది. బహుమతి కొట్టేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం.
వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబుని నేనే.. అంటూ వైరల్ వయ్యారిపై చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ డ్యాన్స్‌లు వేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే తాజాగా కర్ణాటకకు చెందిన ఒక విద్యార్ధిని ఈ పాటకు అదిరిపోయే డ్యాన్స్ వేసింది. బాలీవుడ్ స్టైల్లో ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేస్తూ జూనియర్ సినిమా హీరో కిరీట రెడ్డిని ఆకట్టుకుంది.
హీరో కిరీటరెడ్డి సమక్షంలో ఎంతో అందంగా, ఫుల్ ఎనర్జిటిక్‌గా ఆ విద్యార్ది డ్యాన్స్ వేసింది. దీంతో హీరో ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఈ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ.. ఆ విద్యార్దిని మెచ్చుకున్నారు. అంతేకాదు, డ్యాన్స్ వేసిన తర్వాత కిరీటి ఒక చిన్న కానుక కూడా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ సుమతో కలిసి స్టెపులు వేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆ చిన్నారికి డ్యాన్స్‌కు మస్త్ ఫిదా అయిపోతున్నారు. సంగీతానికి, డ్యాన్స్‌కి వయసు ఎప్పుడూ అడ్డురాదంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.