Viral Video: టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో హనుమాన్ విలన్.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: హీరోల నుంచి విలన్‌గా టర్న్ అయిన వారిలో వినయ్ రాయ్ ఒకరు. వినయ్ 2007లో ‘నీవల్లే నీవల్లే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై, ప్రత్యేకించి యువతలో మంచి హిట్‌గా నిలిచింది.
Viral Video: టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమలో హనుమాన్ విలన్.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: హీరోల నుంచి విలన్‌గా టర్న్ అయిన వారిలో వినయ్ రాయ్ ఒకరు. వినయ్ 2007లో ‘నీవల్లే నీవల్లే’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై, ప్రత్యేకించి యువతలో మంచి హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ‘వాన’ సినిమాలో నటించాడు. వాన సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే తర్వాత వినయ్ తమిళ సినిమాల వైపు అడుగులు వేశాడు. కొన్ని ముఖ్యమైన చిత్రాల్లో నటించి, ‘డాక్టర్’ సినిమాలో విలన్ పాత్రతో సూపర్ రెస్పాన్స్ అందుకున్నాడు. ఆ సినిమా తెలుగులోనూ హిట్ అయింది. ఇక ఇటీవల వచ్చిన ‘హనుమాన్’ చిత్రంలో కూడా వినయ్ విలన్‌గా తన అద్భుత నటనతో మెస్మరైజ్ చేశాడు.
విలన్‌గా క్రేజ్ తెచ్చుకుంటున్న వినయ్ రాయ్ ప్రస్తుతం టాలీవుడ్ నటీమణితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. విమలా రామన్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ జంట తరచూ సోషల్ మీడియాలో కలిసి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
విమలా రామన్ తెలుగులో ‘ఎవరైనా ఎప్పుడేనా’, ‘గాయం 2’, ‘రంగ ది దొంగ’, ‘చుక్కలాంటి అమ్మాయి’, ‘నువ్వా నేనా’ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంతేగాక మలయాళంలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి బంధం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. గాండీవధారి అర్జున సినిమాలో వినయ్ రాయ్, విమలా రామన్ భార్యాభర్తలుగా కనిపించారు. సినిమా షూటింగ్ నుంచే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారిందని టాక్ వినిపిస్తోంది.