Thalapathy Vijay : దళపతి విజయ్ జన నాయగన్ ఆడియో లాంచ్..గిన్నిస్ రికార్డుకు ప్లాన్

దళపతి విజయ్ ఇప్పుడు సినిమా, రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన పార్టీ పెట్టి కరూర్‌లో చేసిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది చనిపోయారు.

Update: 2025-11-27 08:40 GMT

Thalapathy Vijay : దళపతి విజయ్ జన నాయగన్ ఆడియో లాంచ్..గిన్నిస్ రికార్డుకు ప్లాన్

Thalapathy Vijay : దళపతి విజయ్ ఇప్పుడు సినిమా, రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఆయన పార్టీ పెట్టి కరూర్‌లో చేసిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత విజయ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. అయినా సరే ఆయన ఇప్పుడు మళ్ళీ రికార్డు స్థాయిలో జనాలను పోగేసి ఒక పెద్ద కార్యక్రమం చేయబోతున్నారు. కాకపోతే ఈసారి రాజకీయాల కోసం కాకుండా తన చివరి సినిమా జన నాయగన్ ప్రమోషన్ కోసం చేస్తున్నారు.

విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నందున ఈ జన నాయగన్ సినిమానే ఆయనకు చివరి సినిమా అవుతుందని తెలుస్తోంది. ఇది 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. దానికి ఇప్పుడే ప్రచారం స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకను చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. అయితే ఈ వేడుక ఇండియాలో కాకుండా మలేషియాలో జరుగుతుంది. అక్కడ దాదాపు లక్ష సీట్లు ఉన్న పెద్ద స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 27న చేయబోతున్నారు.

ఇది దళపతి విజయ్‌కి చివరి సినిమా కాబట్టి, ఆయనకు గ్రాండ్‌గా గౌరవం ఇవ్వడానికి ఈ మ్యూజిక్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. లక్షల మంది అభిమానులు, పెద్దపెద్ద సంగీతకారులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. మలేషియాలోని ఈ స్టేడియంలో జరిగే జన నాయగన్ ఆడియో లాంచ్ ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ వేడుక టికెట్లు కూడా చాలా ఎక్కువ రేట్లకు అమ్ముడవుతున్నాయట. టిప్పు, ఎస్పిబి చరణ్, అనురాధ శ్రీరామ్, విజయ్ ఏసుదాస్ వంటి ప్రముఖ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయ్‌కి ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నారని సమాచారం. తమిళ సినీ చరిత్రలోనే ఇది అతి పెద్ద ఆడియో రిలీజ్ ఫంక్షన్ అవుతుందని చెబుతున్నారు.

ఈ 'జన నాయగన్' సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. హెచ్. వినోద్ ఈ సినిమాకు డైరెక్టర్. దళపతి విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్ వంటి వారు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ చివరి సినిమా కావడం, దానికి ఇంత గ్రాండ్ ప్రమోషన్ చేస్తుండడంతో అంచనాలు మరింత పెరిగాయి.

Tags:    

Similar News