Vijayendra Prasad: "తలైవి" సినిమా పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విజయేంద్రప్రసాద్
Vijayendra Prasad: తలైవి" సినిమా విషయమై అసంతృప్తి గా ఉన్న స్టార్ రైటర్
తలైవి మూవీపై విజయేంద్ర ప్రసాద్ అసంతృప్తి (ఫైల్ ఇమేజ్)
Vijayendra Prasad: ఒకప్పటి స్టార్ హీరోయిన్ మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన దివంగత జయలలిత జీవితం ఆధారంగా ఈ మధ్యనే "తలైవి" అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ సినిమాలో జయలలిత పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతంతమాత్రంగానే కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది. ఆఖరికి తమిళనాడులో కూడా ఈ సినిమాని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు అని చెప్పుకోవచ్చు. విజయేంద్రప్రసాద్ వంటి స్టార్ రైటర్ ఉన్నప్పటికీ సినిమాలో సరైన ఎలివేషన్స్ లేవని, కమర్షియల్ ఫార్మాట్ లోనే సినిమా మొత్తం సాగిందని చాలామంది విమర్శిస్తున్నారు.
ఇక ఈ సినిమా విషయంలో విజయేంద్రప్రసాద్ సైతం అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన రాసిన కొన్ని మంచి సన్నివేశాలు పక్కకి పడేశారట. డైరెక్టర్ విజయ్ ఏ ఎల్ మరికొందరు రైటర్స్ ని కూడా పెట్టుకొని సినిమా కోసం డిఫరెంట్ కథలు తయారు చేయించారట. దీంతో విజయేంద్రప్రసాద్ కూడా సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ సినిమా చుట్టూ చాలానే వివాదాలు నడుస్తున్నాయి. బడ్జెట్ విషయంలో కూడా నిర్మాతలు విజయ్ పై మండి పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్మాతలు అనుకుంటున్నారని సమాచారం.