సుప్రీం తీర్పుతో నా రెండు దశాబ్దాల కల నెరవేరింది : విజయశాంతి

భారత సైనిక దళాల్లో మహిళలకు పురుషులతోపాటు సమాన హోదా కల్పించే దిశగా.. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2020-02-19 09:42 GMT
Vijaya Santhi File Photo

భారత సైనిక దళాల్లో మహిళలకు పురుషులతోపాటు సమాన హోదా కల్పించే దిశగా.. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుకి సంబంధించి పలువురు ప్రముఖులు స్పందిస్తు్న్నారు. అందులో భాగంగా సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ సందర్భంగా ఫేస్‌బుక్ లో ఒక చిత్రంలో ఫోటో ఫోస్ట్ చేస్తూ.. దానికి క్యాప్షన్ జోడించారు "ఐపీఎస్ అధికారిగా, లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా, లాయర్ గా, సీబీఐ అధికారిగా, మహిళా మంత్రిగా, ఆటోడ్రైవర్ గా, ముఖ్యమంత్రిగా, జర్నలిస్టుగా, పారిశ్రామికవేత్తగా, అమాయకంతో నిండిన నిజాయితీ ఆడబిడ్డగా, అణగారిన వర్గాల హక్కులపై తిరగబడ్డ ఉద్యమ కారిణిగా... ఇంకా ఎన్నో, ఎన్నెన్నో అసంఖ్యాక పాత్రలతో మహిళలలో స్ఫూర్తి నింపే అవకాశం సుదీర్ఘమైన నా సినీ ప్రయాణం 1979 నుంచి ఇప్పటి వరకు ప్రేక్షక దైవాలు ఆశీస్సులతో నాకు లభించింది.

వీటిలో నేను నటించి, అందరి ఆదరణ పొందిన బహుభాషా చిత్రం భారతరత్నలో పోషించిన ఆర్మీ కమాండర్ పాత్ర నాతో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. రెండు దశాబ్దాల క్రితం నేను పోషించిన ఆర్మీ ఆఫీసర్ పాత్రను వాస్తవ రూపంలోకి తెచ్చేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో 20 ఏళ్ల క్రితం నేను ఆర్మీ ఆఫీసర్ గా కన్న కల ఇప్పుడు సాకారం అయ్యింది. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సైన్యాన్ని ముందుండి నడిపించడంలో తమ వంతు పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదంటూ' ఆమె పోస్టు చేశారు.


Full View


Tags:    

Similar News