Vijay Deverakonda: నన్నెవరు ఆపలేరు.. 'కింగ్‌డమ్' ట్రైలర్ లాంచ్‌లో రాయలసీమ యాసలో రౌడీభాయ్ రచ్చ

Vijay Deverakonda: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా కింగ్‌డమ్ మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ జులై 26 తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది.

Update: 2025-07-27 05:49 GMT

Vijay Deverakonda: నన్నెవరు ఆపలేరు.. 'కింగ్‌డమ్' ట్రైలర్ లాంచ్‌లో రాయలసీమ యాసలో రౌడీభాయ్ రచ్చ

Vijay Deverakonda: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా కింగ్‌డమ్ మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ జులై 26 తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతిలోని నెహ్రూ మైదానంలో జరిగిన ఈ బహిరంగ కార్యక్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎటువంటి ప్రత్యేక అతిథులను ఆహ్వానించకుండా, కేవలం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ మాత్రమే హాజరయ్యారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన విజయ్ దేవరకొండ, ఈసారి ప్రత్యేకంగా రాయలసీమ యాసలో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. "ఈసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి నా వెంట, నా సినిమా వెంట నిలబడితే, నేను నంబర్ 1 అయిపోతాను టాప్ ప్లేసులోకి వెళ్లి కూర్చుంటాను" అని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ప్రతిసారీలాగే, ఈసారీ కూడా ప్రాణాన్ని పణంగా పెట్టి పని చేశాను. ఈసారి నా సినిమాలోని ఇతర విభాగాలను చూసుకోవడానికి చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతంగా పని చేశారు. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఎడిటర్ నవీన్ నూలి, మా నిర్మాత నాగవంశీ ఇంటర్వ్యూలలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ నటనను కూడా విజయ్ ప్రశంసించాడు.

"ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారు. ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ఆశీర్వాదం. ఈ రెండు నాకు తోడుగా ఉంటే, మమ్మల్ని ఎవరూ ఆపలేరు" అని విజయ్ దేవరకొండ అన్నారు. "మరో నాలుగు రోజుల్లో మీ అందరినీ థియేటర్లలో కలుస్తాను. అప్పటివరకు మీరే చూసుకోవాలి వెంకన్న స్వామి" అంటూ 'గోవింద గోవింద' అని అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు విజయ్ దేవరకొండ.


'కింగ్‌డమ్' సినిమా ఒక స్పై థ్రిల్లర్ కథతో రూపొందింది. సినిమాలోని కొన్ని పాటలు ఇప్పటికే విడుదలై మంచి ప్రశంసలు అందుకున్నాయి. సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. ఈ సినిమా జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    

Similar News