Viral: ఓపెన్ అవుతోన్న విజ‌య్‌, ర‌ష్మిక‌.. హింట్ ఇచ్చేస్తున్నారా?

Rashmika Mandanna and Vijay Deverakonda: టాలీవుడ్‌ ప్రేక్షకులకు ఎంతో చేరువైన జంటగా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ వంటి హిట్‌ సినిమాల ద్వారా వీరిద్దరూ తెరపై మంచి కెమిస్ట్రీ చూపించి అభిమానులను మెప్పించారు.

Update: 2025-06-18 09:38 GMT

Viral: ఓపెన్ అవుతోన్న విజ‌య్‌, ర‌ష్మిక‌.. హింట్ ఇచ్చేస్తున్నారా?

Rashmika Mandanna and Vijay Deverakonda: టాలీవుడ్‌ ప్రేక్షకులకు ఎంతో చేరువైన జంటగా పేరు తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ వంటి హిట్‌ సినిమాల ద్వారా వీరిద్దరూ తెరపై మంచి కెమిస్ట్రీ చూపించి అభిమానులను మెప్పించారు. అప్పటినుంచి వీరి మధ్య రిలేషన్ ఉందంటూ పలుమార్లు ఊహాగానాలు రావడం జరిగింది. తాజాగా ఈ జంట మరోసారి పబ్లిక్‌లో కనిపించడంతో ప్రేమ గాసిప్స్ మళ్లీ వేడి పుట్టిస్తున్నాయి.

ముంబయిలోని విమానాశ్రయంలో రష్మిక, విజయ్‌ ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ప్రయాణించిన దృశ్యాలను పలువురు ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించారు. ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో బాగా షేర్ అవుతున్నాయి. దీంతో వీరి మధ్య ఉన్న అనుబంధం మరోసారి జనాల్లో చర్చనీయాంశమైంది. రహస్యంగా డేటింగ్ చేస్తుండవచ్చన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.

ఇదిలా ఉంటే రష్మిక నటించిన తాజా చిత్రం ‘కుబేర’ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ ఆమెకు ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘కుబేర టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌. దర్శకుడు శేఖర్‌ కమ్ములకు నా కెరీర్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఎంతో మంది నటులకు ఆశల్ని ఇచ్చిన వ్యక్తి. ఈ సినిమాలో నటించిన నా ఫేవరెట్‌ స్టార్స్‌ని బిగ్‌స్క్రీన్‌పై చూడడానికి ఎదురు చూస్తున్నాను’’ అంటూ విజయ్‌ పోస్ట్‌ చేశారు.

కాగా ఈ క్యూట్ పెయిర్ మ‌రోసారి సినిమాలో రిపీట్ కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రెండు హిట్‌ చిత్రాల తర్వాత మళ్లీ రాహుల్‌ సంకృత్యాన్‌ సినిమాలో జోడీగా న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రి ఈ జంట నిజంగానే రియ‌ల్ క‌పుల్‌గా మార‌నున్నారా అనేది వేచి చూడాలి.



Tags:    

Similar News