Tollywood: శర్వానంద్ మూవీని మిస్ చేసుకున్న విజయ్.. ఎంతకా సినిమా ఏంటంటే?
ఒక హీరో చేయాల్సిన సినిమాలను మరో హీరోలు చేయడం ఇండస్ట్రీలో సర్వసాధారణం.
Tollywood: శర్వానంద్ మూవీని మిస్ చేసుకున్న విజయ్.. ఎంతకా సినిమా ఏంటంటే?
ఒక హీరో చేయాల్సిన సినిమాలను మరో హీరోలు చేయడం ఇండస్ట్రీలో సర్వసాధారణం. స్టార్ హీరోలు వదులకున్న స్టోరీలతో కుర్ర హీరోలు హిట్స్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. టైమ్ మిషిన్ నేపథ్యంలో, మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మొదట విజయ్ దేవరకొండ కోసం అనుకున్నారని మీకు తెలుసా.? దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ కథను విజయ్‌కే చెప్పాడట. విజయ్‌కి ఆ కథ విపరీతంగా నచ్చేసిందట.
రెండుమూడు సార్లు ఈ కథ విని.. హీరోగా నటించడంతో పాటు స్వయంగా తనే నిర్మించాలని కూడా భావించాడని సమాచారం. అయితే చివరికి కథను తాను న్యాయం చేయలేనేమో అనే అనుమానంతో ‘ఒకే ఒక జీవితం’ను వదులుకున్నట్లు విజయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలా విజయ్ సినిమా కాస్త శర్వానంద్ చేతుల్లోకి వెళ్లిందన్నమాట.
ఇక విజయ్ తన కొత్త సినిమా ‘కింగ్‌డమ్’ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది ఫ్రాంచైజీ మూవీ కాదని చెబుతూనే.. సీక్వెల్ రాదని కచ్చితంగా చెప్పలేం అంటూ స్పందించాడు. కాగా గత కొన్ని రోజులుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతోన్న విజయ్‌ని కింగ్‌డమ్ మూవీ ఎంత వరకు కాపాడుతుందో చూడాలి.