Kingdom Box Office Collection Day 1: మాస్ కమ్ బ్యాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..?

Kingdom Box Office Collection Day 1: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోంది.

Update: 2025-08-01 04:35 GMT

Kingdom Box Office Collection Day 1: మాస్ కమ్ బ్యాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..?

Kingdom Box Office Collection Day 1: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోంది. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండకు సరైన మాస్ హిట్ దక్కలేదు. అయితే, కింగ్‌డమ్ సినిమాతో ఆయన మళ్లీ మాస్ లుక్ లో కనిపించి, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఈ సినిమా విజయంతో విజయ్ దేవరకొండ సత్తా ఏంటో మరోసారి రుజువైంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో పక్కా మాస్ రోల్‌లో అదరగొట్టారు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తొలి రోజున దేశవ్యాప్తంగా రూ.15.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా విజయ్ దేవరకొండకు బంపర్ హిట్ ఇచ్చింది.

కింగ్‌డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక కానిస్టేబుల్‌గా కనిపించారు. అయితే, అతని పాత్ర అక్కడితోనే ముగిసిపోదు. ఒక వైపు కానిస్టేబుల్‌గా ఉంటూనే, మరోవైపు ఒక Spyగా మారిపోతాడు. అంతేకాకుండా, తన అన్నయ్య కోసం వెతుకులాట సాగించే వ్యక్తిగా కూడా విజయ్ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. ఈ సినిమాకు గౌతమి తిన్ననూరి దర్శకత్వం వహించారు. నాగ వంశీ ‘సితారా ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండతో పాటు సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే తదితరులు నటించారు.

ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన బుక్ మై షోలో ఈ సినిమా 8 రేటింగ్ పొందింది. ఈ సినిమా ఈజీగా రూ.100 కోట్లు వసూలు చేయవచ్చని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కింగ్‌డమ్ విజయం, విజయ్ దేవరకొండ కెరీర్‌కు మరో పెద్ద మలుపు అవుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News