ఎవరు ఏది ప్రేమిస్తారో.. అది వాళ్లకు దక్కాలి..వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ రిలీజ్

యూత్‌లో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్‌ను అంతా ఇంతా కాదు. అయితే తాజా విజయ్ దేవరకొండ హీరోగా రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.

Update: 2020-02-06 11:46 GMT
వరల్డ్ ఫేమస్ లవర్

యూత్‌లో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్‌ను అంతా ఇంతా కాదు. అయితే తాజా విజయ్ దేవరకొండ హీరోగా రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఇక ఈ సినిమాకు కాంత్రి మాధవ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకు చెందిన ట్రైలర్ విడుదలయింది. ఈ ట్రైలర్ లవ్ అండ్ ఎమోషనల్ గా సాగింది. సినిమా ప్రేక్షకులను ఈ ట్రైలర్ కట్టిపడేసేలా ఉంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ట్రైలర్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ లో మొదలవుతుంది. అందులో ఈ ప్రపంచంలో స్వార్ధం ఏదైనా.. ఉందంటే ప్రేమలోనే.. ఆ ప్రేమలో నేను అనే 2 అక్షరాలు సునామీనే సృష్టించగలదు. అందుకే ఐ వాంటెడ్ టుబీ (వరల్డ్ ఫేమస్ లవర్) అంటూ మొదలు పెడతాడు. కాగా.. ఈ ట్రైలర్‌లో విభిన్న గెటప్స్‌లో విజయ్ దేవరకొండ కనిపింస్తాడు. ఇక మాస్ ప్రేక్షకులను కోసం ట్రైలర్‌లో కొంత మసాలా డైలాగ్స్ పెట్టినట్టు అనిపిస్తోంది. ఐశ్వర్య రాజేశ్‌ను దృష్టిలో పెట్టుకొని విజయ్ దేవరకొండ చెప్పే "మీ ఆడోళ్లకు అసలు ఆగదా..? బట్ట కొంటే ఒంటి మీద వేసేయడమేనా..?" అంటూ చెప్పే డైలాగ్ ఆసక్తిగా ఉంటుంది.

ఇక ఈ సినిమాలో రోమాన్స్ కు పెద్దపీట వేసినట్లు కనిపిస్తుంది. క్యాథరీన్ పరిచయం చేస్తూ.. మేడమ్‌కు మైన్స్ చూపించాలంట, నేను పోతున్నాను... అంటూ చెప్పిన డైలాగ్స్ పేలిపోతున్నాయి. విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌కు ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని ట్రైలర్ రూపొందిచారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దీసేపట్లోని లక్షల్లో వీవ్స్ వచ్చాయి. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Full View


Tags:    

Similar News