Devarakonda - Sukumar Movie: విజయ్-సుకుమార్ కాంబో మూవీపై క్లారిటీ

Vijay Devarakonda - Sukumar Movie: సుకుమార్- విజయ్ దేవరకొండ కాంబో లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే.

Update: 2021-04-19 13:12 GMT

సుకుమార్- విజయ్ దేవరకొండ (ఫొటో ట్విట్టర్)

Vijay Devarakonda - Sukumar Movie: సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబో లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఈ మూవీపై ఎటుంవంటి అప్‌డేట్ లేదు. దీంతో కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి.

ఈ సినిమా ఆగిపోయిందని కొందరు, లేదు వాయిదా పడిందని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఫాల్కన్ క్రియోషన్స్ ఎల్ఎల్పీ సంస్థ ఎట్టకేలకు స్పందించింది. వీరి కాంబోలో మూవీ ఆగిపోలేదని, ఖచ్చితంగా అనుకున్న టైం మేరకు సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్నారు. ఈ సినిమాను ఈ సంస్థే నిర్మిస్తోంది. దీంతో సుకుమార్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మూవీపై క్లారిటి వచ్చింది.

కాగా, ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్‌తో హ్యాట్రిక్ సినిమా 'పుష్ప' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే పుష్ప టీజర్ విడుదలైంది. టీజర్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

ఇక, విజయ్.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాతో బిజీగా మారాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. సుకుమార్, విజయ్ దేవరకొండ కమిట్మెంట్స్ అయిన వెంటనే వీరి కాంబోలో చిత్రం ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ తాజా ప్రెస్ నోట్‌లో వెల్లడించింది.

Tags:    

Similar News