బయోపిక్ లో నటించడానికి సిద్ధం అంటున్న వెంకటేష్

Venkatesh: రామానాయుడు బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన వెంకటేష్

Update: 2022-05-26 07:30 GMT

బయోపిక్ లో నటించడానికి సిద్ధం అంటున్న వెంకటేష్

Venkatesh: ఈ మధ్యకాలంలో బయోపిక్ ల హవా బాగానే నడుస్తుంది. అయితే అన్ని బయోపిక్ లో ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద హిట్ అవటం లేదు. ఎంత పెద్ద సెలబ్రిటీ బయోపిక్ అయినప్పటికీ, కథ ఆసక్తికరంగా ఉండి కేవలం నిజాలను మాత్రమే చూపిస్తేనే బయోపిక్ లు హిట్ అవుతున్నాయి.

ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్, సావిత్రి బంటి లెజెండరీ నటుల బయోపిక్ బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేశాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు బయోపిక్ తీస్తే నటిస్తారా అని అడగగా, మహేష్ బాబు ఆ సినిమాలో నటించలేదు పోయినప్పటికీ కచ్చితంగా సినిమాని నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు బయోపిక్ ల విషయంలో సోషల్ మీడియాలో ఆసక్తిగా మారిన మరో సెలబ్రెటీ ప్రముఖ నిర్మాత రామానాయుడు.

తన తండ్రి రామానాయుడు బయోపిక్ తీస్తే అందులో నటించడానికి సిద్ధమని "ఎఫ్ 3" సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్ ని అడగగా వెంకీ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఒకవేళ స్క్రిప్ట్ బాగుంటే ఖచ్చితంగా రామానాయుడు బయోపిక్ లో నటించడానికి తాను సిద్ధం అని వెంకటేష్ క్లారిటీ ఇచ్చారు.

ఇక గతంలో స్వామి వివేకానంద బయోపిక్ లో కూడా తనకి నటించాలని ఉండేదని కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వర్కవుట్ కాలేదని అన్నారు వెంకీ. 13 భాషల్లో 150కి పైగా సినిమాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా తన పేరును నమోదు చేసుకున్న రామానాయుడు బయోపిక్ కథ తెలుసుకోవాలని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News