Venkatesh - Rana: నెట్ఫ్లిక్స్ కోసం జతకట్టనున్న రానా మరియు వెంకటేష్

Update: 2021-08-11 13:15 GMT

Rana Daggubati and Venkatesh: (Photo: The Hans India)

Venkatesh - Rana Daggubati: థియేటర్ల లాక్ డౌన్ పుణ్యమా అని ఈ మధ్య ఓటిటి లకి మరియు వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవాలి. అయితే డిజిటల్ దిగ్గజం గా చెప్పుకోబడే నెట్ఫ్లిక్స్ మాత్రం మంచి కంటెంట్ ను అందించడంలో పూర్తిగా విజయం సాధించలేదని చెప్పుకోవాలి. ఈ మధ్యనే విడుదలైన 'నవరస' కూడా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా నెట్ఫ్లిక్స్ స్టార్ హీరోల నుంచి కంటెంట్ కోసం ప్రయత్నిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుబాటి నెట్ ఫిక్స్ తో ఒక వెబ్ సిరీస్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.

రానా ఈ ప్రాజెక్టును నిర్మించడం మాత్రమే కాక ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు కూడా. తనతోపాటు విక్టరీ వెంకటేష్ కూడా ఈ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా "నారప్ప" సినిమాను విడుదల చేసిన వెంకటేష్ తన తదుపరి సినిమా "దృశ్యం 2" కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ తో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు మన వెంకీ మామ. ఇక నెట్ఫ్లిక్స్ కోసం రానా మరియు వెంకీ చేయబోతున్న వెబ్ సిరీస్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

Tags:    

Similar News