యూట్యూబ్ లో హీరోయిన్ సాయి పల్లవి జోరు మాములుగా లేదు.. ఆమె సినిమా పాటలకి మంచి వ్యూస్ వస్తున్నాయి. ఫిదా సినిమా నుండి వచ్చిందే పిల్లా మెల్లగా వచ్చిండే, ఎంసీఏ సినిమా నుండి మై డియర్ నాని, మారి 2 నుండి రౌడీ బేబీ పాటలకి గాను కోట్ల వ్యూస్ వరకు చేరుకున్నాయి. కొన్ని కొన్ని సార్లు ఆమె రికార్డును ఆమె బద్దలు కొట్టింది.
అయితే ఇప్పుడు ఆమె రికార్డులను బద్దలు కొట్టేందుకు వరుణ్ తేజ్ తాజాగా నటించిన ఎల్లువచ్చి గోదారమ్మ పాట వచ్చిందా అనిపిస్తుంది. ఈ పాటకి సంబంధించిన పూర్తి వీడియోని చిత్ర యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ పాట దూసుకుపోతుంది. విడుదలైన ఒక్క రోజులోనే ఈ పాట మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది.ఈ పాటకి మిక్కి జే మేయర్ సంగీతం అందించగా, ఎస్పీ బాలు, పీ సుశీల ఆలపించారు.
పూజా హేగ్దే డాన్స్,వరుణ్ తేజ్ లుక్, హరీష్ టేకింగ్ ప్రేక్షకులని అలా కట్టిపడేశాయి. ఈ పాటకి ఫిదా అయ్యామని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ పాట ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.