Varun Tej: దర్శకుడి వేటలో వరుణ్ తేజ్?

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Update: 2021-05-24 17:15 GMT

వరుణ్ తేజ్ (ఫొటో ట్విట్టర్)

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో మైత్రి మూవీ మేకర్స్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. కానీ, ఈ చిత్రం కోసం డైరెక్టర్‌ కోసం కష్టాలుపడుతున్నారంట నిర్మాతలు.

మేకర్స్ వరుణ్ తేజ్ కు భారీ అడ్వాన్స్ ను కూడా చెల్లించారని టాక్ నడుస్తోంద. కానీ, ఈ చిత్రానికి డైరెక్టర్ ను ఫిక్స్ చేయలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట. ఎవరైన దర్శకుడు తన స్క్రిప్ట్‌తో వరుణ్ తేజ్‌ను ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తే, మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు అవకాశం ఉంది. మరి దర్శకుడి వేటలో మేకర్స్ ఎప్పటికి విజయం సాధిస్తారో చూడాలి.

మరోవైపు, వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా టైటిల్ 'గని' తో బిజీగా ఉన్నాడు. ఇందులో అతను బాక్సర్ పాత్రను పోషిస్తున్నాడు. కిరణ్ కొర్రపతి ఈ ప్రాజెక్టుకు డెరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. అలాగే ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇంకా ప్రకటించలేదు.

Tags:    

Similar News