Ghani Teaser: ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటావు..కాని గెలిస్తేనే చరిత్రలో ఉంటావు
Ghani Teaser Released: వరుణ్ తేజ్ "గని" మూవీ టీజర్ విడుదల
Ghani Teaser: ఆట ఆడిన ఓడిన రికార్డ్స్ లో ఉంటావు..కాని గెలిస్తేనే చరిత్రలో ఉంటావు
Ghani Movie Teaser Release: కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్, బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తున్న "గని" చిత్రం యొక్క టీజర్ తాజాగా విడుదల అయింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, కన్నడ నటుడు ఉపేంద్ర, జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్దు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. "గని" చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఎస్ఎస్ తమన్ తన సంగీతాన్ని అందించగా జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 తరువాత వరుణ్ తేజ్ ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్ధమవుతుంది.