Varunlav: మొదలైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సందడి..
Varunlav: నవంబర్ 1న మధ్యాహ్నం 2 :45కి పెళ్లి ముహూర్తం
Varunlav: మొదలైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సందడి..
Varun Tej-Lavanya: సినీనటుడు నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటలీలోని సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. నిన్న రాత్రి ఏర్పాటు చేసిన కాక్‌టెయిల్ పార్టీతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఈరోజు ఉదయం 11 గంటల నుంచి హల్దీ వేడుక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈరోజు పూల్ పార్టీ జరుగుతుంది. సాయంత్రం 5:30 గంటల నుంచి మెహందీ నిర్వహించనున్నారు. చివరగా నవంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 2:48కి పెళ్లి ముహూర్తం జరగనుంది. రేపు రాత్రి 8:30 గంటలకు వివాహ రిసెప్షన్ కూడా జరగనుంది. మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబం, స్నేహితులు సహా దాదాపు 120 మంది అతిథులు ఈ వివాహానికి హాజరుకానున్నారు.