Varun Tej: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్-లావణ్య.. కమింగ్ సూన్ అంటూ పోస్ట్
మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టు అభిమానులతో పంచుకున్నారు.
Varun Tej: గుడ్ న్యూస్ చెప్పిన వరుణ్-లావణ్య.. కమింగ్ సూన్ అంటూ పోస్ట్
Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టు అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయాన్ని ఒక ప్రత్యేకమైన ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు.
ఈ ఫొటోతో పాటు "జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను... కమింగ్ సూన్!" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వారి ఈ హ్యాపీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కంగ్రాట్జ్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, అల్లు స్నేహా రెడ్డి లాంటి వారు సోషల్ మీడియాలో వారి జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వెండితెరపై వీరి ప్రేమకథ మొదలైన సందర్భం 2017లో విడుదలైన మిస్టర్ సినిమాలో మొదలైంది. ఈ సినిమా ద్వారా వారు తొలిసారి కలసి పనిచేశారు. ఆ సమయంలో వారు సన్నిహితులు అయ్యారు. అనంతరం 2018లో వచ్చిన అంతరిక్షం సినిమాతో మరోసారి జంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఇలా వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. చివరకు 2023 నవంబర్ 1న, ఇటలీలోని టస్కానీ ప్రాంతంలో బంధువులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవల లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ అనే వెబ్‌సిరీస్‌లో నటించి మళ్లీ ప్రేక్షకుల మద్దతు పొందారు. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.
Life’s most beautiful role yet -
— Varun Tej Konidela (@IAmVarunTej) May 6, 2025
Coming soon ♥️♥️♥️ pic.twitter.com/532M5e8muV