Upendra From RAPO22: రామ్ కొత్త సినిమాలో ఉపేంద్ర.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
Upendra From RAPO22: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో కొత్త చిత్రం తెరకెక్కుతోంది.
Upendra From RAPO22: రామ్ కొత్త సినిమాలో ఉపేంద్ర.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
Upendra From RAPO22: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని RAPO22 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. "మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి" సినిమాతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర "సూర్య కుమార్" అనే పాత్రలో నటించనున్నారు. ఇందులో ఉపేంద్ర ఒక సెలబ్రిటీ పాత్రలో కనిపించనున్నారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటించనుంది. ఇక రామ్ పోతినేని ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాకు టెక్నికల్ టీమ్ కూడా టాప్ క్లాస్ టాలెంట్‌తో రూపొందిస్తున్నారు. ఈ నెల 15న టైటిల్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు.
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నూని
మ్యూజిక్: వివేక్-మెర్విన్
ఎడిటింగ్: జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా