Upasana Konidela: ఉపాసన ఇంట తీవ్ర విషాదం.. మెగా కోడలి ఎమోషనల్ పోస్ట్..
Upasana Konidela: ఉపాసన ఇంట విషాదం నెలకొంది.
Upasana Konidela: ఉపాసన ఇంట తీవ్ర విషాదం.. మెగా కోడలి ఎమోషనల్ పోస్ట్..
Upasana Konidela: ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆమె చివరి వరకు ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నాను.. ఆమె నన్ను పెంచింది. నేను ఆమెను ఎప్పటికీ ప్రేమగా గుర్తుంచుకుంటాను. నా గ్రాండ్ పేరెంట్స్‌తో నేను అందుకున్న ప్రేమానుభవాలను నా పిల్లలకు కూడా అందేలా చూస్తానని మాటిస్తున్నాను అంటూ ఉపాసన ఎమోషనల్ అయింది. తన నానమ్మ పుష్ప తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది ఉపాసన. నెటిజన్స్ , మెగా ఫ్యాన్స్ ఉపాసనకు సానుభూతిని తెలియజేస్తున్నారు.