Upasana Birthday: భార్య పుట్టినరోజు సెలబ్రేషన్.. చరణ్ పోస్ట్ వైరల్

మెగా కోడలు ఉపాసన తన 37వ పుట్టినరోజు సందర్భంగా మరో వసంతంలోకి అడుగుపెట్టింది. భర్త రామ్ చరణ్‌తో కలిసి ఇంట్లోనే సింపుల్‌గా బర్త్‌డే జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోని చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Update: 2025-07-20 17:00 GMT

మెగా కోడలు ఉపాసన తన 37వ పుట్టినరోజు సందర్భంగా మరో వసంతంలోకి అడుగుపెట్టింది. భర్త రామ్ చరణ్‌తో కలిసి ఇంట్లోనే సింపుల్‌గా బర్త్‌డే జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోని చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో చరణ్, ఉపాసనతో పాటు వారి కూతురు క్లీంకార కూడా కనిపించింది. ఈసారి క్లీంకార ముఖం కూడా కొంతవరకు రివీల్ కావడం అభిమానులను సంతోషపరిచింది. సాధారణంగా సెలబ్రిటీలు విదేశాల్లో గ్రాండ్‌గా పుట్టినరోజులు జరుపుకుంటారు. గతంలో చరణ్-ఉపాసన కూడా అలా చేసేవారు. కానీ ఈసారి చరణ్ బిజీ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఇంట్లోనే సాదాసీదాగా బర్త్‌డే సెలబ్రేట్ చేసినట్టు తెలుస్తోంది.

మెగా ఫ్యాన్స్ చరణ్ పోస్ట్ దిగువన కామెంట్స్ పెడుతూ ఉపాసనకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.

చరణ్ సినిమాల విషయానికొస్తే

ప్రస్తుతం రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో నటిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఢిల్లీలో షూటింగ్ పూర్తి చేసుకున్న చరణ్, ప్రస్తుతం కొత్త షెడ్యూల్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News