Jani Master: హీరోగా జానీ మాస్టర్
Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.
Jani Master:(File Image)
Jani Master: బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సినిమాలు రంగ స్థలం, రాధే, ఖైదీ 150 లాంటి చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్. తాజాగా జానీ మాస్టర్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో 'మంత్ర', 'మంగళ' వంటి చిత్రాలతో పేరుతెచ్చుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు దక్షిణ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
శుక్రవారం జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ''జానీతో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. అరకు, గోవా, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. నిర్మాణ సంస్థతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తా'' అని పేర్కొన్నారు.