Trisha: నేను ద్రోహి కాదు, మీరు ఊహిస్తున్న దాని కంటే పెద్ద షాక్ ఉంది.. త్రిష ఆస్తికర వ్యాఖ్యలు
Trisha: త్రిష నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. కమల్ హాసన్, శింబు హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Trisha: నేను ద్రోహి కాదు, మీరు ఊహిస్తున్న దాని కంటే పెద్ద షాక్ ఉంది.. త్రిష ఆస్తికర వ్యాఖ్యలు
Trisha: త్రిష నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’. కమల్ హాసన్, శింబు హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ట్రైలర్ వచ్చాక అందరికన్నా ఎక్కువగా చర్చకు గురైన అంశం త్రిష పాత్ర.
కమల్ హాసన్‌తో ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించడం అభిమానులకు షాకిచ్చింది. గతంలో ‘వినైతండి వరువాయ్’ (తెలుగులో ‘ఏ మాయ చేసావే’) చిత్రంలో శింబుతో త్రిష రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే త్రిష ఇప్పుడు శింబు పక్కన కాకుండా కమల్ హాసన్ సరసన నటించడం అభిమానులకు అంత సులభంగా జీర్ణం కాలేదు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తూ “ద్రోహి” అన్న ట్యాగ్‌తో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విషయం త్రిష దృష్టికి రావడంతో ఓ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ – “నన్ను ద్రోహి అంటున్నారు అనేది నాకు తెలుసు. కానీ ఈ సినిమాలో వాళ్లు ఊహించినదానికంటే పెద్ద షాక్ ఉంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి,” అని సమాధానమిచ్చింది. అంతేగాక, “ఈ కథనాన్ని పూర్తిగా చూడగానే శింబుకు జోడిగా ఎవరు ఉన్నారో తెలుస్తుంది,” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
త్రిష చేసిన వ్యాఖ్యలతో సినిమాలో ఏదో ట్విస్టు ఉందని స్పష్టమవుతోంది. ఇందులో ప్రధాన నటీమణులు త్రిష, అభిరామి ఇద్దరూ కమల్ హాసన్‌తో కలిసి కనిపిస్తున్నారు. కానీ శింబుకు జోడిగా ఎవరు నటిస్తున్నారు అన్న విషయాన్ని ఎక్కడా వెల్లడించకపోవడం అసలు సస్పెన్స్‌గా ఉండనుంది. జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.