Prabhas: స్పిరిట్ మూవీ హీరోయిన్ ఫిక్స్.. డార్లింగ్‌కు జోడిగా నటించే ఆ బ్యూటీ ఎవరంటే
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్', హను రాఘవపూడితో ఓ రొమాంటిక్ డ్రామా చేస్తున్నారు. ఇదే సమయంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది. గత కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. దీపికా పదుకొణె నుంచి మరికొంతమంది బ్యూటీల పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తూ వాటికి ఫుల్ స్టాప్ పెట్టారు.
స్పిరిట్ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ త్రిప్తి దిమ్రీ ఫిక్స్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. సినిమాకు సంబంధించిన అన్ని భాషల్లో ఆమె పేరుతో ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. గతంలో సందీప్ వంగా రూపొందించిన ‘యానిమల్’ సినిమాలో త్రిప్తి గెస్ట్ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. నటించింది కాసేపే అయినా ఒక్కసారిగా ఇండియా దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు ప్రభాస్ సరసన మెయిన్ హీరోయిన్‌గా ఆమె ఎంపిక కావడంతో, ఆమె కెరీర్‌కు ఇది మైలురాయిగా నిలిచే అవకాశముంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ చేయడం, సందీప్ వంగా స్క్రీన్ ప్లే, త్రిప్తి దిమ్రీ జత కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 2025 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.