Trinadha Rao: మజాకా హిట్ తో జోరు పెంచిన త్రినాథరావు.. మరో ఇంట్రెస్టింగ్ మూవీకి శ్రీకారం..

Trinadha Rao: ఇటీవల మజాకా సినిమాతో సూపట్ హిట్ అందుకున్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన.

Update: 2025-03-01 05:43 GMT

Trinadha Rao: మజాకా హిట్ తో జోరు పెంచిన త్రినాథరావు.. మరో ఇంట్రెస్టింగ్ మూవీకి శ్రీకారం..

Trinadha Rao: ఇటీవల మజాకా సినిమాతో సూపట్ హిట్ అందుకున్నారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఇదిలా ఉంటే త్రినాధరావు తన తదుపరి సినిమాను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సారి యువ హీరో హవీష కోనేరుతో సినిమాను తీయబోతున్నారు త్రినాథరావు. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను డైరెక్ట్ చేయడంలో త్రినాథ రావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ నేపథ్యంలో యంగ్ హీరో హవీష్ తో డబుల్ బ్లాక్ బస్టర్ సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టారు నక్కిన త్రినాథరావు. ఈ సినిమా ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా సెట్స్ పైకి వెళ్లిందంట. మంచి ముహూర్తం చూసుకుని అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక నక్కిన త్రినాధరావు సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన విషయం తెలిసిందే.

నువ్విలా, జీనియస్, 7 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు హవీష్ కోనేరు. ఇక త్రినాథరావు డైరెక్షన్‌లో చేయబోయే సినిమాలో తనను తాను కొత్తగా పరిచయం చేసుకోబోతున్నారు. నువ్విలా సినిమాలో హవీష్ కామెడీ ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఓ కొత్త రైటర్ కథను రెడీ చేశారని తెలుస్తోంది. హవీష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఫార్మల్ షూట్ మొదలు పెట్టిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారని సమాచారం.

Tags:    

Similar News