Toxic Movie Glimpse: ఇంటిమేట్ సీన్స్ పై గీతూ మోహన్‌దాస్ స్పందన
Toxic Movie Glimpse :యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic Movie) సినిమా అభిమానుల్లో భారీ ఆసక్తిని సృష్టిస్తోంది.
Toxic Movie Glimpse: ఇంటిమేట్ సీన్స్ పై గీతూ మోహన్‌దాస్ స్పందన
Toxic Movie Glimpse :యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic Movie) సినిమా అభిమానుల్లో భారీ ఆసక్తిని సృష్టిస్తోంది. ‘ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్‌అప్స్’ అనేది చిత్రానికి ఉపశీర్షిక. ఇటీవల యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉండటంతో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ వాటిపై స్పందిస్తూ, “మహిళా దర్శకురాలు ఇలాంటి సన్నివేశాలు రూపొందించిందంటూ వచ్చే విమర్శలతో నేను చిల్ అవుతున్నాను” అని తెలిపారు.
గ్లింప్స్‌లో శ్మశానం వద్ద కారులో జరిగిన సన్నివేశాల్లో నటించిన నటిని కూడా పరిచయం చేశారు. ఆమె పేరు బీట్రీజ్ బాఖ్. ఈ హాలీవుడ్ నటి TV సిరీస్ ‘Brooklyn Nine-Nine’ ద్వారా గుర్తింపు పొందిన ఆమె, డిస్నీ యానిమేటెడ్ చిత్రం ‘Encanto’లో కూడా నటించారు.
‘టాక్సిక్’లో యశ్‌తో పాటు ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా, ఎలిజిబెత్‌గా హ్యుమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార, రెబెకాగా తారా సుతారియా, మెలిసాగా రుక్మిణి వసంత్ మెరవనున్నారు. ఈ సినిమా రొమాంటిక్, డ్రామా, థ్రిల్ మిశ్రమంగా ప్రేక్షకులను ఆకట్టనుంది.