VakeelSaabFirstLook: పవన్‌ కొత్త లుక్‌పై టాలీవుడ్ స్టార్స్ ట్వీట్స్

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌'. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది.

Update: 2020-03-02 13:44 GMT
Pawan kalyan

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌'. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ లుక్ విడుదల కావడంతో అభిమానులు, పలువురు సినీ ప్రముఖలు స్పందిస్తున్నారు. దిల్‌రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. రెండేళ్లు క్రితం పవన్‌ చివరిగా 2018లో 'అజ్ఞాతవాసి'లో నటించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు.

2019 అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రాజకీయాల్లో తీరికలేకుండా గడిపారు. పవన్‌కల్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుతూ వస్తున్నారు. దీంతో మళ్లి సినిమాల్లో నటించేందుకు పవన్ సిద్దమైయ్యారు. దీంతో సందేశాత్మక చిత్రం పింక్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'వకీల్‌సాబ్‌'లోని పవన్‌ లుక్‌ను చూసి ఎవరేమన్నారంటే..







 


Tags:    

Similar News