హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం.. క్రికెట్–సినిమా సంగమంగా TPL
హైదరాబాద్ వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం EBG గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం.. క్రికెట్–సినిమా సంగమంగా TPL
హైదరాబాద్ వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వగ్, సురేశ్ రైనా హాజరయ్యారు. ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ మొదలైంది. టాలీవుడ్ ప్రో లీగ్‌కు హానరరీ చైర్మన్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. నిర్మాతలే జట్టు ఓనర్లుగా ఆరు జట్లతో ఫ్రాంచైజీ లీగ్ TPL.. ఏడాదికి రెండు సీజన్లు నిర్వహించనున్నారు. క్రికెట్‌తో పాటు వినోద కార్యక్రమాలు, ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ కంటెంట్, ఫ్యాన్ జోన్లు ఉండనున్నాయి. టాలీవుడ్ ఐక్యతే లక్ష్యంగా టీపీఎల్ నిర్వహిస్తున్నామని దిల్ రాజు తెలిపారు. సినీ పరిశ్రమలో ప్రతి వృత్తికి ప్రాతినిధ్యం ఉంటుందని దిల్ రాజు పేర్కొన్నారు. సినిమా, క్రీడల సంగమంగా టాలీవుడ్ ప్రో లీగ్‌ను నిర్వహిస్తున్నామని దిల్ రాజు చెప్పారు.
వీరేంద్ర సెహ్వాగ్..
చాలామందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది..
గొప్పగా ఆడాలి, టీమ్ ఇండియా లో ఆడాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు..
సినీ స్టార్స్, టెక్నీషియన్స్ తో కలిసి ఇలాంటి లీగ్ ఏర్పాటు చేయడం, ఇందులో ఆడటం కూడా చాలా గొప్ప విషయం..
నిత్యం సినిమాలతో బిజీ గా ఉండే టెక్నీషియన్స్ కి ఇది గొప్ప రిలీఫ్ మాత్రమే కాదు.. వాళ్ళ కల నిజం అయ్యే సందర్భం కూడా..