Rana Mihika wedding: రానా, మిహీకాల పెళ్లి తేదీ ఫిక్స్!

Update: 2020-06-10 12:32 GMT

యంగ్ హీరో రానా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన మిహీకా బజాజ్‌ తో గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న రానా ఇటివలే తన ప్రేయసి అంటూ సోషల్ మీడియాలో అందరికి తెలియజేశాడు. ఇటీవ‌ల రెండు కుటుంబాల వారు క‌లిసి రోకా వేడుక‌ను కూడా నిర్వ‌హించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రానా-మిహికాల పెళ్లి తేదీ ఖరారైంది. ఆగస్టు 8న తన ప్రేయసి మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు రానా.

పెళ్లి తంతు మూడు రోజులపాటు నిర్వహించబోతున్నట్లు తెలిసింది. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం అధికారికంగా వెల్లడించారు. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని చెప్పారు. హైదరాబాద్‌లోనే ఈ శుభకార్యాన్ని జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. 

Tags:    

Similar News