Nandamuri Balakrishna on Coronavirus: 'అందరి ధ్యేయం కరోనాను జయించడమే': బాలకృష్ణ
Nandamuri Balakrishna on Coronavirus: కరోనాకు భయపడి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బాలకృష్ణ విజ్ఞప్తి చేసారు.
Nandamuri Balakrishna (File Photo)
Nandamuri Balakrishna on Coronavirus: కరోనాకు భయపడి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బాలకృష్ణ విజ్ఞప్తి చేసారు. ఇప్పుడు మనందరి ధ్యేయం కరోనాను జయించడమేనని.. ప్లాస్మా థెరపీ వల్ల చాలా మంది కోలుకుంటున్నారని చెప్పారు. ఇక సినిమా షూటింగ్ లపై ఇండస్ట్రీ లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. షూటింగ్ అంటే చాల మంది యూనిట్ సభ్యులు ఉంటారని.. జాగ్రత్తగా వ్యహరించాలని బాలకృష్ణ పేర్కొన్నారు. అంతే కాదు కరోనాను ప్రభుత్వాలు వదిలేయోద్దని.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రల లో కరోనా కేసులో రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇరు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అలాగే ప్రజలు కరోనాను లైట్ తెసుకోవద్దని బాలకృష్ణ కోరారు.
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది.
దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక సింహా , లెజెండ్ సినిమాలలో లాగే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారని తెలుస్తోంది. అందులోనూ ఓ పాత్ర వారణాశి సమీపంలో ఉండే అఘోరాదిని తెలుస్తోంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం..