Tollywood: రజినీ మూవీలో బాలయ్య.? ఆ మూవీ నుంచి క్రేజీ అప్డేట్
మల్టీ స్టారర్ మూవీస్ ప్రేక్షకులకు కొత్త ఏం కాదు. సీనియర్ ఎన్టీఆర్ కాలం నుంచి ఈ ట్రెండ్ చూస్తు వస్తున్నాం. అయితే ఆ తర్వాత కొన్ని రోజులు ఈ ట్రెండ్ తగ్గింది. కాగా ప్రస్తుతం మళ్లీ మల్టీ స్టారర్ మూవీలు వస్తున్నాయి. ఇద్దరు బడా స్టార్‌లు కలిసి నటించడం అభిమాలకు పండుగలా ఉంటుంది.

ముఖ్యంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సీనియర్ హీరోలు కలిసి నటిస్తే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ప్రయత్నాలవైపు దర్శకులు, నిర్మాతలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. 2023లో వచ్చిన ‘జైలర్’ సినిమా దీనికి బెస్ట్ ఎగ్జాంప్‌లుగా చెప్పొచ్చు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించడం ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది.
ఇప్పుడు అదే 'జైలర్'కి కొనసాగింపుగా రూపొందిస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్‌లో తెలుగు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్ బాలయ్య కోసం మొదటి భాగం 'జైలర్'లోనే ఒక పవర్‌ఫుల్ పోలీసు పాత్రను రూపొందించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే ‘జైలర్ 2’లో మాత్రం బాలకృష్ణ పాత్ర దాదాపుగా ఖరారైందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఆయన కోసం ఒక పవర్ ఫుల్ రోల్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు చిత్రబృందం నుంచి ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాతో పాటు ఏకకాలంలో జైలర్ 2లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.