Thug Life: కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే సినిమా విడుదలే కాదు – హెచ్చరిస్తున్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్
కన్నడపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయబోమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ హెచ్చరించింది.
Thug Life: కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే సినిమా విడుదలే కాదు – హెచ్చరిస్తున్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్
Thug Life: కమల్ హాసన్ తన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రమోషన్లలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన “కన్నడ, తమిళం నుంచి పుట్టింది” అనే వ్యాఖ్య పలువురు కర్ణాటక ప్రజలు, సంఘాలను క్షోభకు గురిచేశాయి.
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల చేయనిదిగా కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది.
ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎం. నరసింహలు మాట్లాడుతూ, “ఇది సినిమాల గురించి కాదు, రాష్ట్ర గౌరవం గురించి. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకుండా ఈ సినిమా విడుదల సాధ్యం కాదు. మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధంగా లేరు” అని అన్నారు.
కమల్ హాసన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కన్నడ భాషకు ఉన్న గొప్ప చరిత్రను గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర కూడా కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక కమల్ హాసన్ మాత్రం తన మాటలను తిరిగి తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. “ఇది ప్రజాస్వామ్యం. నేను తప్పు చేశానని నమ్మితేనే క్షమాపణ చెబుతాను. నన్ను ఇంతకుముందూ బెదిరించారు. కానీ నేను న్యాయంపై విశ్వాసం పెట్టినవాడిని. కర్ణాటక, ఆంధ్ర, కేరళ పట్ల నాకు గౌరవం ఉంది. ఎవరూ దీన్ని అనుమానించనక్కర్లేదు,” అంటూ తేల్చి చెప్పారు.
ఈ పరిస్థితుల్లో థగ్ లైఫ్ చిత్రం కర్ణాటకలో విడుదల కావాలంటే కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది.