Theaters Reopen: జులై 30 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమాల సందడి

Theaters: 30న థియేటర్ల పునఃప్రారంభం * సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్న థియేటర్ ఓనర్స్

Update: 2021-07-24 08:44 GMT

జులై 30 నుంచి తెరుచుకోనున్న థియేటర్స్ (ఫైల్ ఇమేజ్)

Theaters Reopen: తెలుగునాట బొమ్మ బంద్‌ అయి చాలా రోజులైంది. నృత్యాలు, పాటలతో అలరించే వెండితెర బోసిపోయింది. ప్రేక్షకులతో కిక్కిరిసే థియేటర్లు తాళం కప్పలతో వెలవెల బోతున్నాయి. మరి థియేటర్‌లు ఎప్పుడు పునఃప్రారంభం కానున్నాయి? హాలులో బొమ్మ ఎన్నడు పడనుంది?

నేడే చూడండి మీ అభిమాన థియేటర్లలో ఈ మాట వినిపించక చాలా కాలమైంది. కరోనా ఫస్ట్‌వేవ్‌ ముగిశాక థియేటర్లలో సందడి మొదలైందనుకునేలోగా సెకండ్‌ వేవ్‌ ప్రత్యక్షమైంది. థియేటర్లని మళ్లీ మూసేసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం 100శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చినా థియేటర్స్‌ తెరుచుకోవడం లేదు. రిలీజ్‌కు సరైనా సినిమా లేకపోవడంతో థియేటర్స్‌లో బొమ్మ పడటం లేదని ఓనర్స్‌ అంటున్నారు. అయితే జులై 30 నుంచి సినిమాల సందడి మొదలవుతుందని చెబుతున్నారు. ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి 'ఇష్క్‌', 'తిమ్మరుసు' చిత్రాలు.

అటు ఏపీలో కూడా సేమ్‌ సిచ్యూవేషన్‌. ఏపీలో ఫీప్టీ పర్సెంట్‌ అనుమతితో మూడు ఆటల ప్రదర్శనకు అనుమతి ఉన్న ఎక్కడా కూడా థియేటర్స్‌ తెరుచుకోవడం లేదు. అయితే జులై 30న ఏపీలో కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి కొంతమంది నిర్మాతలు ముందుకొస్తున్నారు.

జులై 30 తర్వాత సినిమాలు రిలీజ్ అవుతున్నా పెద్ద సినిమాలు ఇప్పటివరకు డేట్స్ ప్రకటించలేదు రెండు రాష్ట్రాల్లో ఒకే విధమైన వాతావరణం ఉంటేనే స్టార్స్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News