భల్లాల దేవా వెనుక ఆసక్తికర ట్విస్టులు!
అక్టోబర్ 31న విడుదల కానున్న "బాహుబలి ది ఎపిక్" కోసం రాజమౌళి టీమ్ ప్రమోషన్లు వేగవంతం చేస్తోంది. రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా రూపొందించడంతో పాటు, డిలీట్ అయిన కొన్ని సీన్స్ కూడా జోడించబోతున్నారని తెలిసి సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భల్లాల దేవా వెనుక ఆసక్తికర ట్విస్టులు!
అక్టోబర్ 31న విడుదల కానున్న "బాహుబలి ది ఎపిక్" కోసం రాజమౌళి టీమ్ ప్రమోషన్లు వేగవంతం చేస్తోంది. రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా రూపొందించడంతో పాటు, డిలీట్ అయిన కొన్ని సీన్స్ కూడా జోడించబోతున్నారని తెలిసి సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో "కట్టప్ప బాహుబలిని పొడవకపోయి ఉంటే?" వంటి సృజనాత్మక ప్రశ్నలతో టీమ్ పబ్లిసిటీని కొత్త స్థాయికి తీసుకెళ్తోంది. ఇదిలా ఉంటే, ఈ విజువల్ గ్రాండియర్ వెనుక ఉన్న కొన్ని తెలియని కథలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
భల్లాల దేవా పాత్రకు మొదట రానా కాదు?
మొదట భల్లాల దేవా పాత్ర కోసం రానాను ఎంపిక చేశారు. అయితే ఆ సమయంలో రానాకు డేట్స్ ఖాళీగా లేకపోవడంతో, రాజమౌళి సీనియర్ నటి జయసుధ కుమారుడు నీహార్ కపూర్ ను సంప్రదించారు. నీహార్ వెంటనే అంగీకరించి నెల రోజుల పాటు వర్క్‌షాప్స్‌లో కూడా పాల్గొన్నాడు.
కానీ అప్రత్యక్షంగా రానా తన డేట్స్ అడ్జస్ట్ చేసి, భల్లాల దేవా పాత్రను తానే చేస్తానని రాజమౌళికి చెప్పేశాడు. దీంతో నీహార్‌కి కాలకేయ పాత్ర ఆఫర్ చేశారు. అయితే ఆ పాత్రకు అవసరమైన క్యారికేచర్లు, ప్రోస్తెటిక్ మేకప్ వగైరా చూసి, తన తల్లి సలహా మేరకు నీహార్ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. ఆ పాత్రను చివరికి ప్రభాకర్ పోషించి, కాలకేయగా పేరు తెచ్చుకున్నాడు.
మిస్ అయిన అవకాశాలు
తాజా ఇంటర్వ్యూలో నీహార్ ఈ విషయాలను వెల్లడించాడు. "భల్లాల దేవా లేదా కాలకేయ పాత్రల్లో ఏదో ఒకటి చేశుంటే నా కెరీర్ వేరేలా ఉండేదేమో" అని చెప్పుకొచ్చాడు. కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రానీ నీహార్, ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నాడు.
ఏదేమైనా, "పాత్రలు ఎవరికి సృష్టించబడి ఉంటాయో వారికే వెళ్తాయి" అన్నట్లుగానే, రానాకు భల్లాల దేవా, ప్రభాకర్‌కి కాలకేయ పాత్రలు దక్కి, వారి కెరీర్‌ను మలుపు తిప్పాయి.