The Raja Saab: బర్త్ డే స్పెషల్ – ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఈ రోజు, అక్టోబర్ 23న, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు.
The Raja Saab: బర్త్ డే స్పెషల్ – ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఈ రోజు, అక్టోబర్ 23న, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమాల నుంచి వరుస అప్డేట్స్ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఉదయం ఫౌజీ సినిమా నుండి ప్రత్యేక హైలైట్స్ వచ్చాయి, తాజాగా రాజా సాబ్ సినిమాకు మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కొత్త పోస్టర్ విడుదల చేశారు.
పోస్టర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపిస్తూ, మేకర్స్ మాట్లాడుతూ “హ్యాపీ బర్త్‌డే రేబల్ స్టార్” అని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, త్వరలో సినిమా నుంచి మొదటి సింగిల్ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
సినిమా ప్రముఖ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కామెడీ-హర్రర్ జాన్రాలో రూపొందుతోంది. సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ప్రకారం, రాజా సాబ్ 2026, జనవరి 9న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ ప్రత్యేక పోస్టర్, మరియు సింగిల్ విడుదలకు అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ రెస్పాన్స్ చూపిస్తున్నారు.