The Girlfriend: ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ రెండో సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్‌లో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మికా మందన్నా మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘యానిమల్‌’తో మొదలైన ఆమె సక్సెస్ జర్నీ, ‘పుష్ప 2’, ‘ఛావా’ వంటి సినిమాలతో కొనసాగింది.

Update: 2025-08-24 09:59 GMT

The Girlfriend: ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ రెండో సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్‌లో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మికా మందన్నా మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ‘యానిమల్‌’తో మొదలైన ఆమె సక్సెస్ జర్నీ, ‘పుష్ప 2’, ‘ఛావా’ వంటి సినిమాలతో కొనసాగింది. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో చేసిన సికందర్ పెద్దగా ఆకట్టుకోకపోయినా, నాగార్జున–ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన కుబేర మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా, గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం, రెండో సింగిల్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రేమలోని ప్రతి అనుభూతి, ప్రతి క్షణాన్ని ప్రతిబింబించే ఈ రొమాంటిక్ సాంగ్‌ను ఆగస్టు 26న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక లవ్లీ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.



Tags:    

Similar News